దర్శకురాలు మృతి

ఈ రోజు (ఆదివారం) ఉదయం 4.30 గంటలకు ప్రముఖ దర్శకురాలు ‘కల్పనా లజ్మి’ మృతి చెందారు. ఆమె మృతి చెందినట్లు నటి హుమా ఖురేషీ ట్వీట్ చేశారు. 61 ఏళ్ళ కల్పనా గత కొంత కాలంగా కిడ్నీ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. రుడాలి, దర్మియాన్‌, ఇన్‌ బిట్వీన్‌ అండ్‌ దామన్‌ ఏ విక్టిమ్‌ ఆఫ్‌ మారిటల్‌ వయలెన్స్ వంటి చిత్రాలకు కల్పనా దర్శకత్వం వహించారు. ఆమె చివరి చిత్రం 2006లో వచ్చిన చింగారి. ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఆమె తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు.