HomeTelugu Trendingబాలీవుడ్‌ బ్యూటీతో నాగ్‌ రొమాన్స్‌!

బాలీవుడ్‌ బ్యూటీతో నాగ్‌ రొమాన్స్‌!

Bollywood beauty in Nagarjuటాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున త్వ‌ర‌లో ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక సోగ్గాడే చిన్ని నాయ‌నా అనే సినిమాకు ప్రీక్వెల్‌గా బంగార్రాజుఅనే సినిమా చేయ‌నున్నట్లుగా గత కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తుండ‌గా, ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించ‌నున్నాడు. మ‌రో వైపు ‘గరుడవేగ’ డైరెక్టర్‌ ప్రవీణ్ స‌త్తారుతో నాగార్జున ఓ యాక్షన్ థ్రిల్లర్ కథ చేయనున్నట్లు తెలుస్తోంది.

ప్ర‌వీణ్ స‌త్తారు- నాగార్జున సినిమా అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుండ‌గా, ఈ సినిమాలో అనిఖా సురేంద్రన్ అనే కొత్త బ్యూటీ నాగ్ రొమాన్స్ చేయబోతున్నట్టు ప్రచారం సాగుతోంది . మరోవైపు కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ నటి గుల్ పనాగ్ నటించబోతున్నారని సమాచారం. ఈ వార్త నిజ‌మైతే గుల్ ప‌నాగ్‌కు ఈ చిత్రం తెలుగులో తొలి సినిమా కానుంది. ఈ చిత్రాన్ని శరత్ మరార్ తో కలిసి ఏషియన్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu