ఎమోషన్ స్టోరీతో మహేశ్‌!

టాలీవుడ్ లో గీత గోవిందం సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. విజయ్ దేవర కొండకు, రష్మిక మందన్నకు ఈ సినిమా బ్రేక్ ను ఇచ్చింది. ఇదిలా ఉంటె, గీత గోవిందం తరువాత దర్శకుడు పరశురామ్.. హీరో మహేశ్‌ ను కలిసి ఎమోషన్ స్టోరీని చెప్పారట. స్టోరీ బాగుండటంతో డెవలప్ చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. ప్రసుత్తం పరశురామ్ కొంత కామెడీని జోడించి స్క్రిప్ట్ ను డెవలప్ చేస్తున్నారట.

స్క్రిప్ట్ వర్క్ పూర్తికాగానే మహేష్ ను కలిసి స్క్రిప్ట్ చెప్తారని సమాచారం. మహేశ్‌ నటిస్తున్న మహర్షి సినిమా విడుదలకు సిద్ధం అవుతున్నది. ఈ సినిమా తరువాత మహేశ్‌.. ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. దీని తరువాత పరశురామ్ తో చేసే అవకాశం ఉంటుంది.