HomeTelugu Trendingతారక్-త్రివిక్రమ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఆమేనా?

తారక్-త్రివిక్రమ్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఆమేనా?

12 5
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రోబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో తారక్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారట. ఇందులో ఒక హీరోయిన్‌గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డేను ఎంపిక చేశారట. సెకండ్ హీరోయిన్ కోసం మరో ముద్దుగుమ్మ కోసం వెతికే ప్రయత్నాల్లో ఉన్నారట చిత్రబృందం. పాన్ ఇండియా చిత్రం కావడంతో వీరిలో బాలీవుడ్ నుంచి ఒకరిని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. వీరిలో ముఖ్యంగా జాన్వి, అలియాభట్ పేర్లు వినిపిస్తున్నాయి. గురూజీ మాత్రం అలియాభట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి క్యాంప్ మాత్రం జాన్విపై మొగ్గుచూపుతున్నారట. ఈ కాంబినేషన్ కుదిరితే టాలీవుడ్‌లో జాన్వి ఎంట్రీ అద్భుతంగా ఉంటుందని టాక్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu