దాసరి పాత్రలో ప్రముఖ దర్శకుడు!

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ బయోపిక్ సినిమాలో ఇప్పటికే అనేకమంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు మరో ప్రముఖుడు కూడా చేరిపోయారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కుతున్నది. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం సినిమా రంగం పరంగా ఉంటె, రెండో భాగం మాత్రం రాజకీయాలతో ముడిపడి ఉంటుంది.

ఎన్టీఆర్ తో బెస్ట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుల్లో దాసరి నారాయణరావు కూడా ఒకరు. దాసరి పాత్ర కోసం బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి వంటి సినిమాను తెరకెక్కించిన వివి వినాయక్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తున్నది. ఎన్టీఆర్ కు, వివి వినాయకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. బాలకృష్ణతో సినిమా చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్న వివి వినాయక్, దాసరి రోల్ చేసేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తున్నది.