HomeTelugu Trending'గూఢచారి-2'లో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ

‘గూఢచారి-2’లో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ

Hollywood heroine in Gudhac
టాలీవుడ్‌ యాక్టర్ అడివిశేష్ ప్రస్తుతం ‘గూఢచారి’ సీక్వెల్స్‌తో బిజీగా ఉన్నాడు. శశి కిరణ్ టిక్కా తెరకెక్కించిన ‘గూఢచారి’ బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 2018లో విడుదలైన ఈ సినిమాకి కొనసాగింపుగా ‘జీ2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అడివిశేష్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘జీ 2′(G2).

ఈ సినిమాకు వినయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న చిత్రంబృందం ఈ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్‌లో అడివిశేష్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ న‌టి బ‌నితా సంధు న‌టించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు.

బ‌నితా సంధు బాలీవుడ్ మూవీ అక్టోబ‌ర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ‘జీ2’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. ఇక ఈ సీక్వెల్‌ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌ల‌పై టీవీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu