HomeTelugu Trendingఅడివి శేష్‌- శృతిహాసన్‌ మూవీ టైటిల్‌ 'డెకాయిట్‌'

అడివి శేష్‌- శృతిహాసన్‌ మూవీ టైటిల్‌ ‘డెకాయిట్‌’

Dacoit movie Title Teaser

టాలీవుడ్ యంగ్‌ హీరో అడివి శేష్ – శృతిహాసన్‌ జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకి ‘డెకాయిట్‌’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఒక ప్రేమ క‌థ అనేది ఉప‌శీర్షిక. టైటిల్‌ను ప్రకటిస్తూ టీజర్‌ను విడుదల చేసింది.

ఈ టీజ‌ర్ చూస్తే.. బ‌ద్ద‌ శత్రువులుగా మారిన ప్రేమికుల కథ అని తెలుస్తుంది. యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రానుండ‌గా.. షూటింగ్ మొద‌లైన‌ట్లు చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా షనియల్‌ డియో అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమౌతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. త్వరలోనే ఇందులో న‌టించే న‌టిన‌టుల పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu