HomeTelugu Trendingడ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ నిర్మాత భార్య అరెస్ట్‌

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ నిర్మాత భార్య అరెస్ట్‌

Bollywood producer wife arr
బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నదియడ్‌వాలా భార్య షబానా సయీద్‌ను ఆదివారం నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం సబర్బన్‌లోని జూహూలో గల ఆమె నివాసంలో 10 గ్రాముల గంజాయి దొరికింది. షబానా దాన్ని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తేలడంతో ఎన్సీబీ అధికారులు ఆదివారం ఆమెను విచారణకు పిలిచారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిరాజ్‌ భార్య షబానాను నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టం కింద అరెస్టు చేసినట్లు జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖేడే తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఎన్సీబీ అధికారులు ఫిరోజ్‌ను కూడా రావాల్సిందిగా ఆదేశించినప్పటికీ ఆయన హాజరుకాలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu