HomeTelugu Trendingబాలీవుడ్‌ సీనియర్ నటుడు కన్నుమూత

బాలీవుడ్‌ సీనియర్ నటుడు కన్నుమూత

Bollywood senior actor pass

బాలీవుడ్ సీనియర్ నటుడు రియో కపాడియా కన్నుమూశాడు. చక్ దె ఇండియా, దిల్ చాహతా హై లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన రియో కపాడియా కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలతోపాటు ఓటీటీల్లో పలు వెబ్ సిరీస్ లలోనూ అతడు నటించాడు.

రియో కపాడియాకు భార్య మారియా ఫరా, ఇద్దరు కొడుకులు. ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన మేడిన్ హెవెన్ సీజన్-2లోనూ నటించాడు. ఇందులో మృణాల్ ఠాకూర్‌కు తండ్రి పాత్రలో నటించారు. చక్ దె ఇండియా మూవీలో కామెంటేటర్‌గా అద్భుతమైన నటన కనబరిచాడు.

సినిమాలతోపాటు టీవీ రంగంలోనూ రియో మంచి పేరు సంపాదించాడు. సిద్ధార్థ్ తివారీ మహాభారత్‌లో గాంధారి తండ్రి పాత్రలో అతడు నటించాడు. టీవీ రంగంలో నటీనటుల హక్కుల కోసం కూడా పోరాడాడు. సిటీ ఆఫ్ డ్రీమ్స్, ది టెస్ట్ కేస్ లాంటి వెబ్ సిరీస్ లలోనూ రియో కపాడియా నటించాడు.

క్యోంకీ సాస్ బీ కభీ బహూ థీ, జుడ్వా రాజా సప్నే సుహానే లడక్‌పన్ కే, కుటుంబ్ లాంటి సీరియల్స్ తో రియో పేరు సంపాదించాడు. నటుడే కాదు రియో మంచి స్కెచ్ ఆర్టిస్ట్ కూడా. సోషల్ మీడియాలో తన స్కెచ్ లను అతడు షేర్ చేస్తూ ఉండేవాడు. దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, రిషీ కపూర్, శ్రీదేవిలాంటి వాళ్ల స్కెచ్ లనుఅతడు అద్భుతంగా గీశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu