HomeTelugu TrendingRC16: విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ హీరో!

RC16: విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ హీరో!

Bollywood Star Hero as Villain in RC16

RC16: టాలీవుడ్ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌ – ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం ఆర్‌సీ 16. ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. RC16లో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ద‌త్ విల‌న్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ మూవీ స్టోరీ లైన్ న‌చ్చి సంజ‌య్‌ద‌త్ ఓకే చెప్ప‌న‌ట్లు స‌మాచారం. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

rc16

ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఏ.ఆర్‌.రెహమాన్ సంగీతం అందించ‌నుండ‌గా.. మైత్రీమూవీ మేకర్స్ సమర్పిస్తున్నది. వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలపై వెంకటసతీశ్‌ కిలారు అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మించనున్నారు.

యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండే పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ని బుచ్చిబాబు సిద్ధం చేశారని యూనిట్‌ సభ్యులు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu