HomeTelugu Trendingవిశాల్, ఆర్య మల్టీస్టారర్ మూవీ షూటింగ్ పూర్తి

విశాల్, ఆర్య మల్టీస్టారర్ మూవీ షూటింగ్ పూర్తి

Vishal movie Enemy movie
యాక్షన్ హీరో విశాల్ 30వ చిత్రం ఎనిమీ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇందులో విశాల్‌తో పాటు మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటిస్తున్నారు. పదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఇందులో మృణాళిని రవి హీరోయిన్‌. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. త్వరలోనే టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మళ్లీ ఆర్యతో కలిసి నటించినందుకు ఆనందంగా ఉందన్నాడు. చిత్ర యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. త్వరలోనే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలిపాడు. తమిళంతో పాటు పలు భాషల్లో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu