HomeTelugu Newsపుష్పలో బాలీవుడ్‌ బ్యూటీ ఐటెం సాంగ్‌

పుష్పలో బాలీవుడ్‌ బ్యూటీ ఐటెం సాంగ్‌

13 10
స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ సుకుమార్‌ డైరెక్షన్‌లో పాన్ ఇండియా రెంజ్‌లో తెరకెక్కబోయే ‘పుష్ప’ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. జనవరిలోనే సుకుమార్ పుష్ప సినిమా కి సంబందించిన ట్రయిల్ షూట్ చేసాడు. ఒరిజినల్ షూట్ మార్చ్ నుండి పట్టాలెక్కాల్సి ఉంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరక్కబోయే ఈ సినిమాలో నటీనటుల ఎంపిక పూర్తయినా.. మూవీ యూనిట్ మాత్రం ఇంకా విడుదల చేయలేదు. కేవలం హీరో హీరోయిన్స్ పేర్లు తప్ప. పుష్ప ను తెలుగులోనే కాకుండా హిందీ ఇంకా సౌత్ భాషలన్నింటిలోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం సుకుమార్ ‘పుష్ప’ చిత్రం కోసం బాలీవుడ్ ఐటెం బాంబ్ ఊర్వశి రౌటెలాతో సంప్రదింపులు జరుపుతున్నాడట. సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ ను ప్రేక్షకులు ప్రత్యేకంగా ఆశిస్తారు. పైగా దేవీ శ్రీ సంగీతం. బాలీవుడ్ లో ప్రస్తుతం ఐటెం సాంగ్స్ చేయడంతో పాటు హీరోయిన్ గా కూడా నటిస్తున్న ఈ అమ్మడి ఎంట్రీతో పుష్పకు మరింత క్రేజ్ పెరగడం ఖాయం అని సినీవర్గాలు అంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu