అనుష్క కొత్త సినిమా ఓకే చేసింది!

‘బాహుబలి’ సినిమా తరువాత అనుష్క ఆమె అంగీకరించిన ‘భాగమతి’ చిత్రాన్ని పూర్తి చేసింది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె మరే ఇతర సినిమా అంగీకరించింది లేదు. తెలుగు, తమిళ చిత్రనిర్మాతలు ఆమెను సంప్రదించినప్పటికీ ఆమెను మాత్రం ఏ కథ ఎగ్జైట్ చేయలేకపోయింది. ఈ విషయంపై స్పందించిన అనుష్క తన స్థాయికి తగ్గ పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.

అయితే తాజాగా ఆమె ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథానాయిక ప్రాధాన్యత గల ఓ కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్ ఆ కథను అనుష్కకి వినిపించినట్లు తెలుస్తోంది. కథ, కథనాలు ఆసక్తికరంగా అనిపించడం, ఇంతకముందు ఈ తరహా పాత్రను ఆమెను చేయకపోవడంతో అనుష్క ఈ పాత్రలో నటించడానికి అంగీకరించిందని చెబుతున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలు తెలియనున్నాయి.