HomeTelugu Trendingపోతురాజులతో సల్మాన్‌ ఖాన్‌.. వీడియో వైరల్‌

పోతురాజులతో సల్మాన్‌ ఖాన్‌.. వీడియో వైరల్‌

5 29బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఓ ఆసక్తికర వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పోతురాజు వేషదారణలో ఉన్న కొంతమంది వ్యక్తులను సల్మాన్‌ కలిసి వీడియో అది. వీడియోలో సల్మాన్‌ వారితో సరదాగా ముచ్చటించటంతో పాటు వారి కొరడాతో తాను కూడా కొట్టుకున్నాడు. సల్మాన్‌ లాంటి సూపర్‌ స్టార్‌ తమతో కొంత సమయం గడపటంతో వారి ఆనందానికి అవధుల్లేవు.

ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన సల్మాన్‌ ”వారి అనుభూతుల్ని, బాధను పంచుకోవటం ఆనందంగా ఉంది. ఇది మీపై మీరు ప్రయత్నించకండి. మరొకరి మీద కూడా ప్రయోగించకండి’ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు సల్మాన్‌. ప్రస్తుతం సల్మాన్, ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న దబాంగ్ 3 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu