HomeTelugu Big Storiesవాల్తేరు వీరయ్య: 'బాస్ పార్టీ' మాస్‌ సాంగ్‌ విడుదల

వాల్తేరు వీరయ్య: ‘బాస్ పార్టీ’ మాస్‌ సాంగ్‌ విడుదల

Boss Party Lyric Video from

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి పూర్తి మాస్ లుక్ తో కనిపించనున్నారు. చాలా కాలం తరువాత ఆయన ఈ తరహా మాస్ లుక్ తో కనిపిస్తున్న సినిమా ఇదే.

ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ‘బాస్ పార్టీ’ అనే ఒక మాస్ సాంగ్‌ అందించాడు. ఆ పాటను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. చిరంజీవి, బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాపై చిత్రీకరించిన పాట ఇది. ‘క్లబ్బుల్లోన పార్టీ అంటే షరా షరా మామూలే’ అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ సాహిత్యాన్ని అందించగా.. నకష్ అజాజ్, హరిప్రియ ఈ పాటను ఆలపించారు.

చిరంజీవి మోడ్రన్ ముఠామేస్త్రి తరహాలో లుంగీ పైకి కట్టి స్టెప్పులు వేశారు. శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ బాగుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్ నటించనుంది. ఇక ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu