HomeTelugu Big Stories'గుంటూరు కారం'తో శ్రీలీల కోరిక నేరవేరేనా?

‘గుంటూరు కారం’తో శ్రీలీల కోరిక నేరవేరేనా?

Guntur Karam movie2

సూపర్‌ స్టార్‌ మహేష్‌- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రేపు (జనవరి12)న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ హైప్స్‌ ఉన్నాయి. శ్రీలీల కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకుంది.

ఈ సినిమాతో తనకు మరింత స్టార్‌డమ్‌ వస్తుంది అని అనుకుంటుంది. టాలీవుడ్‌లో పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో డ్యాన్స్‌తో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Guntur Karam movie1

ఆ తరువాత వరుస సినిమాలతో టాలీవుడ్‌లో మోస్ట్‌ వాటెండ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో గుంటూరు కారంలో ఛాన్స్‌ దక్కించుకుంది. ఈ సినిమాపై ఈ అమ్మడు పూర్తి నమ్మకంతో ఉంది. ఈ సినిమాలో కూడా శ్రీలీల డ్యాన్స్‌ ఇరగదీసింది. ఈ సినిమా నుండి విడుదలైన కుర్చిమడతపెట్టి సాంగ్ లో శ్రీలీల- మహేష్ మాస్ డ్యాన్స్ తో అదరగొట్టేశారు.

ఈ మూవీ ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు కూడా ఆమె డ్యాన్స్ స్కిల్స్‌ను ప్రశంసించారు. ఈవెంట్‌లో శ్రీలీల మహేష్ బాబుని ప్రశంసించింది. త్రివిక్రమ్- మహేష్ బాబుతో కలిసి ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది. శ్రీలీల ఇటీవలే కీలక పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’లో కూడా మంచి ప్రశంసలు అందుకుంది.

Guntur Karam movie

గుంటూరు కారం సినిమాతో తనకు మరింత క్రేజ్‌ వస్తుందని హోప్స్‌తో ఉంది. ‘గుంటూరు కారం’ మూవీలో మొదటిగా పూజాహెగ్డేను హీరోయిన్‌గా తీసుకున్నారు. పలు కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో శ్రీలీలకు చాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu