HomeTelugu Trending'బాయ్స్‌ హాస్టల్‌' ట్రైలర్‌

‘బాయ్స్‌ హాస్టల్‌’ ట్రైలర్‌

Boys Hostel movie Trailer
కన్నడలో సంచలనం సృష్టించిన హాస్టల్‌ బాయ్స్‌ సినిమా తెలుగులో రిలీజయ్యేందుకు రెడీ అవుతుంది. చార్లీ ఫేమ్‌ రక్షిత్‌ శెట్టి సమర్పించిన ఈ సినిమాకు నితిన్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఈయనకిది తొలి సినిమా. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ రిలీజైంది.

ఈ ట్రైలర్‌లో బాయ్స్‌ హాస్టల్‌ అంటే ఎలాంటి రచ్చ ఉంటుందో చూపించాడు. దానిని చాలా హ్యూమరస్‌గా దర్శకుడు ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఓ వైపు శవంతో క్రైమ్‌ను మరోవైపు అదే శవం చుట్టూ కామెడీ బాగుంది. ముఖ్యంగా ఈ సినిమాలో యాంకర్‌ రష్మీ ఉండటం అందరకీ షాక్‌ను గురి చేసింది. తెలుగు వెర్షన్‌ కోసం స్పెషల్‌గా ఆమె పాత్రను క్రియేట్‌ చేశారు. ఇక ట్రైలర్‌ చివర్లో దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ను కూడా చూపించారు.

ఇలా కన్నడ సినిమాలో ఇద్దరు తెలుగు వాళ్లను తీసుకోవడం.. అందులోనూ అందరికి తెలిసిన మోహాలను పెట్టడం ఈ సినిమాకు ఇక్కడ కలిసొచ్చే అంశమే. కాంతార ఫేమ్‌ అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందించిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడీయోస్‌తో కలిసి ఛాయ్‌ బిస్కెట్‌ వాళ్లు తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu