HomeTelugu Trending'1134' ట్రైలర్‌

‘1134’ ట్రైలర్‌

1134 movie trailer out

వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకురాబోతోంది ‘1134’ మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాతో శరత్ చంద్ర దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోగా.. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్.

ట్రైలర్ చివరలో ‘అన్నీ నువ్వనుకునేలా జరిగితే మరి నేనెందుకురా ఇక్కడ’ అంటూ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. రాంధుని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, మదుపు ఫణి భార్గవ్, కృష్ణ మదుపు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివతేజ్ బైపల్లి, శరత్ కూతాడి సంగీతం అందిస్తున్నారు. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.

యాంకర్‌ శ్యామాలపై ఆర్జీవీ ప్రశంసలు

Recent Articles English

Gallery

Recent Articles Telugu