HomeTelugu Trendingగాడ్‌ఫాదర్‌': గెటప్‌ శ్రీనుపై బ్రహ్మజీ ఆసక్తికర వ్యాఖ్యలు

గాడ్‌ఫాదర్‌’: గెటప్‌ శ్రీనుపై బ్రహ్మజీ ఆసక్తికర వ్యాఖ్యలు

Brahmaji funny comments on
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్‌’. తాజాగా ఈ సినిమా ప్రెస్‌ మీట్‌ జరిగింది. ఈ వేదికపై నటుడు బ్రహ్మజీ జబర్థస్త్‌ ఫేం గెటప్‌ శ్రీన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో గెటప్‌ శ్రీను ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిరంజీవితో పాటు శ్రీను కూడా అన్ని చోట్లకు ట్రావెల్‌ చేస్తున్నాడు. ఇటీవలే చిరుతో పాటు ఫ్లైట్‌లో ప్రయణించిన ఫొటోలను షేర్‌ చేస్తూ.. తన డ్రీమ్‌ ఫుల్‌ ఫిల్‌ అయింది అని చెప్పాడు.

ఇక ఆ విషయాన్నీ గుర్తిచేస్తూ..బ్రహ్మజీ శ్రీనుని ఆడేసుకున్నాడు. “ఈయన కొంచెం మాట్లాడం మానేశాడు. అన్నయ్యతో ఫ్లైట్‌లో వచ్చాడు. అందుకే యాటిట్యూడ్‌ చూపిస్తున్నాడు. అన్నయ్య పవర్‌ ఏంటో రేపు అందరితో పాటు మనం చూస్తాం. ఇప్పుడు సెలబ్రెటీలు మాట్లాడతారు. ఫ్లైట్‌లో అన్నయ్య కన్నా ఈయనే ఎక్కువ చేశాడు. ఈయన ఫ్లైట్‌ ఓనర్‌లా, ఈయనతో అన్నయ్య ట్రావెల్‌ చేసిన్నట్లు ఫీల్‌ అయ్యాడు.. యాటిట్యూడ్‌ వాలా” చెప్పుకోవచ్చు. బ్రహ్మజీ సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu