HomeTelugu Trendingబిగ్‌బాస్: మరో ముగ్గురు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ..!

బిగ్‌బాస్: మరో ముగ్గురు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ..!

Bigg Boss Wild card entry c
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ఈ నెల 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్లు ఉన్నా వీరిలో జనాలకు బాగా తెలిసిన ముఖాలు తక్కువే. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన పేర్లలో చాలామంది పేర్లు మిస్ అయ్యాయి. వీరిలో జబర్దస్త్ నటుడు అవినాష్ వస్తాడని అందరూ ఊహించారు. చివరి నిమిషంలో అతడు లేకపోవడంతో ప్రేక్షకులు కాస్త నిరాశపడ్డారు. అవినాష్ ఉంటే హౌస్‌లో కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని ఊహించారు. అయితే అతడు బిగ్‌బాస్ హౌస్‌లోకి వైల్డ్‌ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. అవినాష్‌తో పాటు మరో ఇద్దరు కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది. ‘ఈ రోజుల్లో’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్కూడా రానున్నట్టు చెప్తున్నారు. ‘కేరింత’ మూవీలో ‘ఒసేయ్ భావ‌న‌’ అనే డైలాగ్‌తో అంద‌రినీ ఆకట్టుకున్నాడు. అదేవిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ‘జంప్ జిలానీ’ హీరోయిన్ ‌స్వాతి దీక్షిత్‌ను కూడా హౌస్‌లోకి పంపే సన్నాహాలు జరుగుతున్నాయట. ఈమె చిత్రాంగ‌ధ‌, లేడీస్ అండ్ జెంటిల్మెన్ చిత్రాల్లోనూ న‌టించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu