HomeTelugu Newsబ్రహ్మానందం ప్రధాన పాత్రలో 'హ్రశ్వ దీర్ఘ'

బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ‘హ్రశ్వ దీర్ఘ’

Brahmanandam new movie titlటాలీవుడ్‌ హాస్యబ్రహ్మా బ్రహ్మానందం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులకు మాత్రం మీమ్స్‌ రూపంలో ఆయన వినోదం పంచుతునే ఉంటారు. ఈ రోజు ఆయన పుట్టిన‌రోజు నేడు. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు, అభిమానులు ఆయ‌న‌ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

ఈ సంద‌ర్భంగా బ్రహ్మానందం న‌టిస్తున్న కొత్త సినిమా అప్‌డేట్ వ‌చ్చింది. బ్రహ్మానందం తాజాగా ఒక తెలుగు – నేపాలీ సినిమా చేస్తున్నాడు. హరిహర అధికరి, నీతా దుంగన ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, ప్రదీప్ రావత్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘హ్రశ్వ దీర్ఘ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. బ్రహ్మానందం న‌టిస్తున్న తొలి నేపాలీ సినిమా ఇది. నీతా ఫిలిం బ్యాన‌ర్‌లో రానున్న ఈ సినిమాకు చంద్ర పంత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా 2024 సెప్టెంబర్ 27న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu