HomeTelugu News'బ్రహ్మాస్త్ర' అధికారిక టైటిల్‌

‘బ్రహ్మాస్త్ర’ అధికారిక టైటిల్‌

5 5బాలీవుడ్‌ నటులు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర అధికారిక టైటిల్‌ లోగోను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. ‘అన్ని అస్త్రాలకు దేవత..ఈ బ్రహ్మాస్త్ర’ అంటూ వీడియోను విడుదల చేసింది. టైటిల్‌ లోగో ఆకట్టుకుంటోంది. ఈ లోగో ప్రముఖ హాలీవుడ్‌ చిత్రం ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ లోగోను తలపిస్తోంది.

శివరాత్రి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 150 డ్రోన్లతో ఆకాశంలో ‘బ్రహ్మాస్త్ర’ టైటిల్‌ను ప్రదర్శించారు. ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రంగా ‘బ్రహ్మాస్త్ర’ ను మూడు భాగాల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమను మరో స్థాయికి తీసుకెళుతుందని చిత్రబృందం తెలిపింది. ఇందులో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున కీలక పాత్రలు పోషించారు. తొలి భాగం క్రిస్మస్‌కు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రీతమ్‌ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu