రెజీనా పేరు చెప్పగానే తలపట్టుకున్న మెగాహీరో!

మెగాహీరో సాయి ధరం తేజ్ హీరోయిన్ రెజీనాతో వరుసగా రెండు సినిమాలు చేసేసరికి వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆ తరువాత వీరిద్దరు కలిసి నటించడం తగ్గించినా… ఏదొక సంధర్భంలో ధరం తేజ్ ముందుకు రెజీనా ప్రస్తావన రావడం దానికి ఆయన సమాధానాలు ఇవ్వడం తప్పడం లేదు.  ఇప్పడు మళ్ళీ అటువంటి సందర్భమే తేజుకి ఎదురైంది.

డిసెంబర్ 1న విడుదకాబోతున్న తన ‘జవాన్’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజుకి మళ్ళీ రెజీనా సమస్యఎదురైంది.  ఈ ఇంటర్వ్యూలో భాగంగా ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నల సందర్భంగా కొందరు అమ్మాయిలతో మాట్లాడిన తేజు తన పక్కన ఏహీరోయిన్ నప్పుతుంది అనే ప్రశ్నవేసాడు. ఈ ప్రశ్నకు ఆ కార్యక్రమానికి వచ్చిన అమ్మాయులు అంతా  రెజీనా అని సమాధానం చెప్పడంతో సాయిధరమ్ తేజ్ తలకొట్టుకొన్నాడు.