HomeTelugu Newsబ్లాక్ అండ్ వైట్‌లో మోహన్‌ లాల్‌ భ్రమ యుగం

బ్లాక్ అండ్ వైట్‌లో మోహన్‌ లాల్‌ భ్రమ యుగం

Bramayugam film in black anమలయాళ సూపర్‌ స్టార్ మోహన్ లాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ‘భ్రమ యుగం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 1960ల దశకంలోని కథగా వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 15 ప్రేక్షకుల ముందుకు రానుంది.

మలయాళ హారర్ ఫిలిం గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ మరోసారి ధృవీకరిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

దీంతో పాటుగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. ఈ సినిమాని బ్లాక్ అండ్ వైట్ లోనే రిలీజ్ చేస్తున్నామని వెల్లడించింది. రాహుల్ సదాశివన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో మమ్ముట్టి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది అని తెలుస్తుంది. ఇక అర్జున్ అశోకన్, సిద్దార్థ్ భారతన్, మలయాళ మణికందన్ నటిస్తున్న ఈ సినిమాని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu