కూలీగా స్టార్‌ హీరోలు!

హ్యాట్రిక్‌ హిట్‌ను కొట్టిన ప్రముఖ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న దర్శకడు అనిల్‌ రావిపూడి. మాస్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తనదైన శైలిలో సినిమాను తెరకెక్కిస్తారు డైరెకర్‌ అనిల్‌ రావిపూడి. అయితే ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌, విక్టరీ వెంకటేష్‌ కాంబినేషన్‌లో ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ను అనిల్‌ రావిపూడి సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ పిక్‌ను పోస్ట్‌ చేశారు. వెంకటేష్‌ సూపర్‌ హిట్‌ మూవీ కూలీ నెం.1 స్టైల్లో ఉన్న ఈ స్టిల్‌లో.. కూలీ నెం.786 వరుణ్‌ అని, కూలీ నెం.1 వెంకటేష్‌ అని అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే కూలీ బ్యాడ్జ్‌లో పశ్చిమ రైల్వే అని ఉన్నందున ఈ చిత్రం కథా నేపథ్యం ముంబై ప్రాంతానికి చెంది ఉండొచ్చని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. తమన్నా, మెహరీన్‌లు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని దిల్‌రాజు నిర్మిస్తున్నారు.