HomeTelugu NewsBramayugam: ఓటీటీలోకి వచ్చేసిన హారర్‌ థ్రిల్లర్‌

Bramayugam: ఓటీటీలోకి వచ్చేసిన హారర్‌ థ్రిల్లర్‌

Bramayugam on ott from toda

Bramayugam: మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘భ్రమ యుగం’. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మళయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియెన్స్ ని కూడా మెప్పించింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించిన ఈ హారర్ థ్రిల్లర్‌ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈరోజు నుంచి మళయాళం, తెలుగు, తమిళ్ మరియు కన్నడ హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ మంచి హైప్‌ని క్రియేట్‌ చేశాయి. ఈ సినిమా మమ్ముట్టి లుక్‌ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది.

దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో థియేటర్‌లో చూడలేని ప్రేక్షకులు ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు వై నాట్ స్టూడియోస్ నిర్మించారు. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్‌లు కీలక పాత్రలు పోషించారు. క్రిస్టో జావియర్ సంగీతం అందించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu