రకుల్ కు ఇలాంటి అబ్బాయి కావాలట!

రకుల్ ప్రీత్ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాబోయే భర్తకు ఉండవలసిన లక్షణాలు వివరిస్తూ మూడు లక్షణాలు ఉండాలి అంటూ కండిషన్స్ పెడుతోంది రకుల్. అబ్బాయికి ఫిట్ నెస్ అంటే బాగా ఇష్టం ఉండాలి అదేవిధంగా వ్యాపారం అంటే అభిరుచి ఉండాలి దీనికితోడు డల్ గా ఉండకుండా ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి అంటూ తన కండిషన్స్ ను బయటపెట్టింది రకుల్. అంతేకాదు ఎట్టి పరిస్తుతులలోను తనకు కాబోయే భర్త సిక్స్ ఫీట్ హైట్ ఉండితీరాలనే మరో కండిషన్ కూడా పెట్టింది. 

అయితే గత 6 సంవత్సరాలుగా తాను ఎన్నో సినిమాలలో అనేకమంది హీరోలతో కలిసి నటించినా తనకు ఏహీరో కూడ లవ్ ప్రపోజ్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని అంటోంది. అందరితో జోక్స్ వేస్తూ టామ్ బాయ్ ఉంటాననేమోనని పక్కన పెట్టేసి ఉంటారని తెగ బాధపడిపోతుంది.