HomeTelugu Trendingబ్రో ప్రీ రిలీజ్‌ ఫిక్స్‌.. ఎక్కడంటే!

బ్రో ప్రీ రిలీజ్‌ ఫిక్స్‌.. ఎక్కడంటే!

Bro pre release
పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ – సాయితేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘బ్రో’. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ డేట్ కోసమే పవన్ అభిమానులందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాదులోని శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. కొంతసేపటి క్రితమే ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇది రెగ్యులర్ గా కనిపించే పాయింట్ కాదు. మొదటి నుంచి చివరివరకూ వినోదభరితంగా సాగే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే – సంభాషణలు త్రివిక్రమ్ అందించడం వలన, అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ తో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu