HomeTelugu Trendingరామ్‌ చరణ్‌తో 'ఉప్పెన' డైరెక్టర్‌ మూవీ

రామ్‌ చరణ్‌తో ‘ఉప్పెన’ డైరెక్టర్‌ మూవీ

Buchibabu sana movie with r

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయమయ్యాడు బుచ్చిబాబు సానా. తన రెండో సినిమాను ఏకంగా రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. తన శిష్యుడు బుచ్చిబాబు సానా, హీరో రామ్ చరణ్ కాంబోలో ఓ పవర్ ఫుల్ సబ్జెక్టుతో పాన్ ఇండియా సినిమా వస్తోందని స్టార్ డైరెక్టర్ సుకుమార్ వెల్లడించారు. కొన్నిసార్లు తిరుగుబాటు అనేది అవసరంగా మారుతుంది అంటూ ఈ సినిమా కథలో ఉన్న లోతును వివరించే ప్రయత్నం చేశారు.

వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై తొలి చిత్రంగా ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కూడా ఈ చిత్రంలో భాగస్వాములని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్… శంకర్ కాంబినేషన్‌లో ఆర్సీ-15ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రాజెక్టును మొదలుపెట్టనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu