HomeTelugu Trendingసమ్మతమే: 'బుల్లెట్టులా నీ వైపే వస్తున్నానే'

సమ్మతమే: ‘బుల్లెట్టులా నీ వైపే వస్తున్నానే’

Bullet La Lyrical From Samm
టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన ‘సెబాస్టియన్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా పెద్దగా గ్యాప్ లేకుండా ‘సమ్మతమే’ సినిమాను వదలడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ప్రవీణ నిర్మించిన ఈ సినిమాకి గోపీనాథ రెడ్డి దర్శకత్వం వహించాడు. కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను వదిలారు. ‘బుల్లెట్టులా నీ వైపే వస్తున్నానే’ అంటూ ఈ పాట సాగుతోంది.

హీరోయిన్ ప్రేమలో పడిపోయిన హీరో ఆమె ప్రతి కదలికను ప్రత్యేకంగా చూస్తుంటాడు. ఆమెతో గడిపిన ప్రతి క్షణాన్ని అపురూపంగా భావిస్తుంటాడు. ఆ నేపథ్యంలో వచ్చే పాట ఇది. శేఖర్ చంద్ర సంగీతాన్ని స్వరపరిచిన ఈ పాటకి సామ్రాట్ సాహిత్యాన్ని అందించగా రితేశ్ ఆలపించాడు. చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu