HomeTelugu Trendingబన్నీ అలవైకుంఠపురములో ఎప్పుడో తెలుసా?

బన్నీ అలవైకుంఠపురములో ఎప్పుడో తెలుసా?

12 3
స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు శుభవార్త. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బన్నీ, పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించేసింది. అందరూ ఊహించనట్లే ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, బన్నీ డైలాగ్‌, సామజవరగమన సాంగ్‌, పోస్టర్‌ ఈ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్‌ చేశాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గీతాఆర్ట్స్‌, హారికా హాసిని క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టబు, జయరామ్, సుశాంత్, నివేదా పేతురాజ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu