HomeTelugu Trendingలారీ డ్రైవర్‌గా మారనున్న బన్నీ!

లారీ డ్రైవర్‌గా మారనున్న బన్నీ!

8 15అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో తన అభిమానులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత దర్శకుడు సుకుమార్ తో కలిసి బన్నీ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.

ఎర్రచందనం దొంగలను స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో రఫ్ లుక్ తో బన్నీ కనిపించనున్నాడట. ఇక ఆయన ఈ పాత్రలో చిత్తూరు యాసలో మాట్లాడతాడని అంటున్నారు. చిత్తూరు యాసలో మాట్లాడటం కోసం బన్నీ ప్రత్యేకంగా ఒక ట్రైనర్ ను నియమించుకున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించనుండగా, విలన్‌ పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu