HomeTelugu Trendingఅల్లు అర్జున్‌, సుకుమార్‌ సినిమా రిలీజ్‌ అప్పుడేనట..!

అల్లు అర్జున్‌, సుకుమార్‌ సినిమా రిలీజ్‌ అప్పుడేనట..!

7 21
స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో మూడో సినిమా పట్టాలెక్కింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగు కేరళలో జరిగింది. తదుపరి షెడ్యూల్ షూటింగులో బన్నీ జాయిన్‌ కానున్నాడు. ‘శేషాచలం’ అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అందువలన పాత్ర పరంగా బన్నీ ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడతాడు. అయితే అడవి నేపథ్యంలోని పూర్తి సన్నివేశాలను కేరళ అడవుల్లో చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయాలనే నిర్ణయానికొచ్చారు. అక్టోబర్ 2వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’ను విడుదల చేసే అవకాశాలు వున్నాయి. అందువలన ముందు నెలలోనే బన్నీ – సుకుమార్ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu