HomeTelugu Trending'బుట్టబొమ్మ' వాయిదా

‘బుట్టబొమ్మ’ వాయిదా

buttaboma
శౌరీ చంద్రశేఖర్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. సూర్య వశిష్ఠ – అనిఖ సురేంద్రన్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా అర్జున్ దాస్ కనిపించనున్నాడు. ఇది ఒక పల్లెటూరి ప్రేమకథ .. తమ ప్రేమను బ్రతికించడం కోసం పోరాడే జంట కథ అనే విషయం ట్రైలర్ ద్వారా అందరికీ అర్థమైపోయింది. అనిఖ సురేంద్రన్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.

ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. వచ్చేనెల 4వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu