HomeTelugu Trending'బటర్ ఫ్లై' ట్రైలర్‌

‘బటర్ ఫ్లై’ ట్రైలర్‌

Butterfly Official Trailer
అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’. రవి ప్రకాశ్ – ప్రసాద్ – ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకి, ఘంట సతీశ్ బాబు దర్శకత్వం వహించాడు. ఈ నెల 29 నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. నగరంలో ఒక సైకో వరుసగా చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి .. ఆ తరువాత చంపేస్తుంటాడు. అతను పెట్టుకున్న ఈ ఆపరేషన్ పేరే ‘బట్టర్ ఫ్లై’. ఒక అపార్టుమెంటులోని ఫ్లాట్ లో నాయిక తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఓ రోజున నాయిక ఇద్దరు పిల్లలను ఒక సైకో కిడ్నాప్ చేస్తాడు. అతని బారి నుంచి తన పిల్లలను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎంతగా తాపత్రయ పడిందనేదే కథ అనే విషయం ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. రావు రమేశ్, భూమిక ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu