HomeTelugu Big Stories'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీపై సెలబ్రిటీల రివ్యూ

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీపై సెలబ్రిటీల రివ్యూ

celebrities review on rrr m

దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన కళాఖండం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమాలో స్టార్‌ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటించారు. ఈరోజు (మార్చి 25న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో కోట్లు గుమ్మరించి తీసిన ఈ సినిమా ఫలితం మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మేకర్స్‌. సోషల్‌ మీడియాలో పాజిటివ్‌ టాక్‌ చూస్తుంటే ఇన్నేళ్ల వారి కష్టానికి ఫలితం దక్కనున్నట్లే కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను వీక్షించేందుకు ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు.

అటు కొమురం భీమ్‌ ఎన్టీఆర్‌ తన ఫ్యామిలీతో, అల్లూరి సీతారామరాజు రామ్‌చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళి ఫ్యాన్స్‌తో కలిసి థియేటర్లలో సినిమా చూసి సందడి చేశారు. మరోపక్క ఈపాటికే సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు సినిమా సూపర్‌ హిట్‌ అంటూ సోషల్‌ మీడియాలో రివ్యూ ఇస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu