HomeTelugu Trendingచిరంజీవికి సెలబ్రెటీల బర్త్‌డే విషెస్‌

చిరంజీవికి సెలబ్రెటీల బర్త్‌డే విషెస్‌

Celebrity Birthday Wishes t

మెగాస్టార్‌ చిరంజీవి ఈ రోజు (ఆగస్టు 22)న 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా తన తండ్రి మెగాస్టార్‌ చిరంజీవికి రామ్‌చరణ్‌ స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘ఆచార్య’ షూట్‌లో భాగంగా తన తండ్రితో గడిపిన ప్రతి క్షణాన్నీ ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ‘ఆచార్య’ షూట్‌కు సంబంధించిన ఓ చిన్న గ్లిమ్స్‌ని ఆయన అభిమానులతో పంచుకున్నారు. ‘నేను అప్పా అని ప్రేమగా పిలిచే మా ఆచార్యతో గడిపిన ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెర్రీ పేర్కొన్నారు. చరణ్‌తోపాటు దర్శకుడు కొరటాల శివ, బాబీ, మెహర్‌ రమేశ్‌, రవితేజ, ప్రకాశ్ రాజ్‌ , పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా చిరంజీవి నటిస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ ఇస్తూ.. ఫ్యాన్స్‌ని ఫుల్‌ ఖుషి చేస్తున్నారు మూవీ యూనిట్‌. ఇప్పటికే “గాడ్ ఫాదర్”, “భోళా శంకర్” టైటిల్స్‌ ప్రకటించారు. భోళా శంకర్‌ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu