HomeTelugu Big Storiesఎన్టీఆర్ కు ప్రముఖుల నివాళి..

ఎన్టీఆర్ కు ప్రముఖుల నివాళి..

4 26నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సినీ తారలు ఆయనను గుర్తుచేసుకున్నారు . మెగాస్టార్ చిరంజీవి ఆయన్ను స్మరించుకున్నారు . ఈ నేపధ్యంలో “తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం’ అంటూ.. ట్వీట్‌ చేశారు. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..” అని వ్యాఖ్యానించారు. కాగా, ఎన్టీఆర్, చిరంజీవి కలసి 1981లో చిరంజీవి, ఎన్టీఆర్‌లు కలిసి ‘తిరుగులేని మనిషి’ అనే చిత్రంలో నటించిన విషయం తెలసిందే. ఈ సినిమాలో ‘యవ్వనం… ఒక నందనం’ అంటూ సాగా పాటలో కలిసి ఆడారు. కాగా ఎన్టీఆర్‌ కూడా తాతకు నివాళులు అర్పిస్తు ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు నందమూరి కళ్యాణ్‌రామ్‌, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, తదితర టాలీవుడ్‌ ప్రముఖులు ట్విటర్‌ వేదికగా ఎన్టీఆర్‌ ఘన నివాళులర్పించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu