వెంకీ సరసన లక్కీ గర్ల్!

తాజాగా దర్శకుడు తేజ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకీ . త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టంగా మారింది. దీంతో ముందుగా వెంకీ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. మొదట అనుష్కను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆమె సినిమాలను అంగీకరించే పరిస్థితిలో లేరు. మరో కొందరు సీనియర్ హీరోయిన్లు సినిమా చేయడానికి అంగీకరించకపోవడంతో ఇప్పుడు మెహ్రీన్ కు ఈ సినిమా ఆఫర్ వచ్చింది.

 ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ తో తెలుగు తెరకు పరిచయమయిన ఈ బొద్దుగుమ్మ ‘మహానుభావుడు’ చిత్రంతో తన ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంది. రీసెంట్ గా ‘రాజా ది గ్రేట్’ తో మరి సక్సెస్ అందుకుంది.  వరుస విజయాలతో లక్కీ హీరోయిన్ గా మారిన మెహ్రీన్ ఈ సినిమా చేయడానికి అంగీకరిస్తుందో.. లేదో.. చూడాలి.