HomeTelugu Big Storiesరామ్‌ చరణ్‌కు సెలబ్రెటీల బర్త్‌డే విషెస్‌

రామ్‌ చరణ్‌కు సెలబ్రెటీల బర్త్‌డే విషెస్‌

Celebritys Birthday Wishesనేడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చరణ్‌తో తాము దిగిన ఫొటోలు పంచుకుంటూ పలువురు సినీతారలు ట్వీట్‌లు చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొమురం భీమ్‌ ఎన్టీఆర్‌ సైతం తాజాగా.. ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా జూనీయర్‌ ఎన్టీఆర్‌ విషెస్ తెలియచేస్తూ.. ‘ధైర్యవంతుడు, నిజాయితీపరుడు, నీతిమంతుడు.. అతడే నా సోదరుడు రామ్‌చరణ్‌’ అంటూ ట్విటర్‌లో ఎన్టీఆర్ విష్‌ చేశారు.. చరణ్‌తో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక నిన్న (శుక్రవారం) రాత్రి అంటే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్లో చరణ్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. దర్శకుడు రాజమౌళి స్వయంగా చరణ్‌కు కేక్‌ తినిపించారు. అనంతరం అందరితో కలిసి చరణ్‌ ఫొటోలు దిగారు. ఆ ఫొటోలను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా హీరోలు మోహన్‌లాల్‌, అల్లు అర్జున్‌, రానా, వరుణ్‌తేజ్‌, శ్రీకాంత్‌, అఖిల్‌ అక్కినేని, ప్రదీప్‌ మాచిరాజు, హీరోయిన్లు కాజల్‌, ఈషారెబ్బ, డైరెక్టర్లు గోపీచంద్‌ మలినేని, సురేందర్‌రెడ్డి, బాబీతో పాటు చాలా మంది ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Akhil Akkineni (@akkineniakhil)

Recent Articles English

Gallery

Recent Articles Telugu