HomeTelugu Big Storiesభారత్‌లో 60 వేలకు చేరువలో కరోనా బాధితులు

భారత్‌లో 60 వేలకు చేరువలో కరోనా బాధితులు

11 7
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 95 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 3,320 మంది కరోనా బారినపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 59,662కి చేరింది. ఇప్పటివరకు భారత్‌లో కరోనా సోకి 1981 మంది మృతిచెందారు. కరోనా నుంచి కోలుకుని 17,847 మంది కోలుకోగా 39,984 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికవరీ శాతం 29.91 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1307 మంది డిశ్చార్జి అయ్యారు.

ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు
ఏపీలో ఇవాళ కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ మొత్తంలో కరోనా బాధితుల సంఖ్య 1930కి చేరింది. వీరిలో 887 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు మరో 999 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఏపీలో కరోనా బారిన పడి 44 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 15 మంది, కృష్ణా 13, గుంటూరు 8, అనంతపురం 4, నెల్లూరు 3, విశాఖలో ఒకరు కరోనా కారణంగా మృతిచెందారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు 376, కృష్ణా 338, అనంతపురం 102, చిత్తూరు 96, నెల్లూరు 96, కడప 96, ప.గో 68, విశాఖ 62, ప్రకాశం 61, తూ.గో 46, శ్రీకాకుళం 5, విజయనగరం 4 కరోనా కేసులు నమోదయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu