చైతు సినిమాలో నాగ్ భజన!

ఏమాయ చేసావే వంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తరువాత నాగచైతన్య, గౌతమ్ మీనన్
దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ సినిమా విడుదల
తేదీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫైనల్ గా నవంబర్ రెండో వారంలో విడుదలకు
సిద్ధంగా ఉంది. ఈ సంధర్భంగా సినిమాకు సంబంధించిన మరోకొత్త ట్రైలర్ ను విడుదల
చేశారు. ఈ ట్రైలర్ చైతు.. ”లవ్ లెటర్స్ ఇవ్వటం, కాలేజ్ బయట వెయిట్ చేయటం, అమ్మాయి
వెనకాల తిరగటం ఇవన్నీ ‘శివ’ సినిమాతోనే అయిపోయాయి. ఇప్పుడు వాడి కొడుకు
కూడా హీరో అయ్యాడు” అంటూ తన తండ్రి ప్రస్తావన వచ్చే డైలాగ్ ఒకటి చెప్పాడు. దీన్ని
బట్టి ముందుగానే సినిమాలో నాగ్ భజన ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. అలానే హీరో
పేరు చెప్పకుండా ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ మొత్తం గౌతమ్ మీనన్ స్టయిల్ లో త్రిల్లింగ్ గా
సాగింది. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి!