చైతు సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది!

ప్రేమమ్ సినిమాతో సక్సెస్ బాట పట్టిన నాగచైతన్య తన తరువాతి సినిమాలు కూడా జాగ్రత్తగా
ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన ‘సాహసం శ్వాసగా
సాగిపో’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను రిలీజ్ చేస్తూనే మరోవైపు కొత్త
సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంతో
హిట్ కొట్టిన కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చైతు సినిమా చేయనున్నట్లు ఎప్పటినుండో వార్తలు
వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సినిమాకు ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.
అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో నిర్మించనున్న ఈ చిత్రాన్ని నవంబర్ 7వ తేదీన గ్రాండ్
గా ప్రారంభించాలని ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు. చైతు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా
నటించనుంది.

CLICK HERE!! For the aha Latest Updates