‘జై సింహా’ టాకీ పార్ట్ పూర్తి!

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ “జై సింహా”. బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం నేటితో రామోజీ ఫిలిమ్ సిటీలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేసుకొని టాకీ పార్ట్ పూర్తి చేసుకోనుంది. రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో బాలకృష్ణ-అశుతోష్ రాణా కాంబినేషన్ లో 60 మంది ఫైటర్స్ తో రామ్-లక్ష్మణ్ ల నేతృత్వంలో ఒక కృషియల్ ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న “జై సింహా” చిత్రాన్ని విడుదల చేయనున్నారు.  
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. “బాలయ్య-నయనతారల కాంబినేషన్ ఈ సినిమాలో విశేషంగా అలరిస్తుంది. ఇవాల్టితో రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన భారీ సెట్ లో ఫైట్ సీక్వెన్స్ పూర్తవుతుంది. దీంతో టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లే. విడుదలైన టైటిల్ మరియు బాలకృష్ణ ఫస్ట్ లుక్ కి నందమూరి అభిమానుల నుంచే కాక తెలుగు సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానున్న సినిమా కూడా అదే స్థాయిలో అలరిస్తుంది”  అన్నారు.