HomeTelugu Trendingజూలన్‌ గోస్వామి బయోపిక్‌ "చక్దా ఎక్స్‌ప్రెస్" టీజర్‌ విడుదల

జూలన్‌ గోస్వామి బయోపిక్‌ “చక్దా ఎక్స్‌ప్రెస్” టీజర్‌ విడుదల

Chakdaha Express Announced
టీమిండియా స్టార్‌ బౌలర్‌ జూలన్‌ గోస్వామి బయోపిక్‌ “చక్దా ఎక్స్‌ప్రెస్” టీజర్‌ గురువారం విడుదలైంది. ఈ బయోపిక్‌లో గోస్వామి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హిరోయిన్‌ అనుష్క శర్మ నటిస్తోంది. ఈ సినిమాను హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనున్నారు. ఈ సినిమాలో భారత క్రికెట్‌కు గోస్వామి అందించిన సేవలను, సాధించిన రికార్డులను చూపించనున్నారు. ప్రోసిత్ రాయ్ డైరెక్షన్‌లో అనుష్క శర్మ, ఆమె సోదరుడు కర్నేష్‌ శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కాగా నిజ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న పాత్రలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది అని అనుష్క తెలిపింది.

“ఇది నాకు నిజంగా ప్రత్యేకమైన చిత్రం. ఎందకంటే గోస్వామి వంటి స్టార్‌ బౌలర్‌ జీవిత ఆధారంగా తెరక్కెతుంది. ఇటువంటి పాత్రలో నటించడం నా అదృష్టం. చక్దా ఎక్స్‌ప్రెస్ చిత్రం మహిళా క్రికెట్‌ విలువను ప్రపంచానికి తెలియజేస్తుంది” అని అనుష్క శర్మ పేర్కొంది. భారత్‌ తరుపున 12 టెస్టులు, 192 వన్డేలు, 68 టీ20 ఆడిన గోస్వామి వరుసగా 44, 240, 56 వికెట్లు సాధించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu