HomeTelugu Trendingవిరాట‌ప‌ర్వం :రానా పాడిన పాట వచ్చేస్తుంది

విరాట‌ప‌ర్వం :రానా పాడిన పాట వచ్చేస్తుంది

Chalo chalo song releasing
టాలీవుడ్‌ నటుడు రానా అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా నటించారు. వేణు ఊడుగుల డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమా షూటింగ్‌ ఫస్ట్‌హాఫ్‌.. గ‌తేడాది పూర్తైన్న… ఈ సినిమా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇటీవ‌లే మేక‌ర్స్ రిలీజ్‌ డేట్‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. న‌క్స‌లిజం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం వ‌రుస అప్‌డేట్ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. తాజాగా మేక‌ర్స్ మ‌రో బిగ్ అప్‌డేట్‌ను ప్ర‌కటించారు.

ఈ చిత్రంలోని ‘ఛ‌లో ఛలో’ అంటూ సాగే వారియ‌ర్ సాంగ్‌ను ఆదివారం విడుద‌ల చేయ‌బోతున్నట్లు ప్ర‌క‌టించారు. ఇందులో విశేషం ఏంటంటే ఈ పాట‌ను స్వ‌యంగా రానా ఆల‌పించాడు. ఇక ఇటీవ‌లే చిత్ర‌బృందం సినీ ప్ర‌ముఖుల‌కు ప్రీమియ‌ర్ షోలు వేయ‌గా.. వాళ్ళ నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఉత్త‌ర తెలంగాణ‌లో 1990లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది.ప్రియ‌మ‌ణి కీల‌క‌పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు. శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌రా సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu