కేసీఆర్‌ను ప్రశ్నించిన చంద్రబాబు

ప్రత్యేకహోదాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడటం సంతోషకరమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హోదాపై అవిశ్వాస తీర్మానం పెడితే టీర్‌ఎస్‌ ఎందుకు మద్దతివ్వలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. సోనియా గాంధీ ప్రత్యేకహోదా ఇస్తామంటే ఆయన వ్యతిరేకించారని ఆరోపించారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడారు. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాలని కేసీఆర్‌ అడిగారన్నారు. వైసీపీకి రూ.వెయ్యి కోట్లు ఇచ్చి ఎందుకు పంపించారని ఆయన ప్రశ్నించారు. ‘కేసీఆర్‌తో కలిసి జగన్‌ నాటకాలు ఆడుతున్నారు. వారం రోజుల నుంచి కేసీఆర్‌ను ఉతికి ఆరేశా. కేసీఆర్‌ జీవితమంతా అబద్ధాలే. మహానాయకుడి మాదిరిగా మనల్ని శాసిస్తారా’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.