వల్లభనేని వంశీకి చెక్ పెట్టనున్న చంద్రబాబు !

టీడీపీ కంచుకోటల్లో గన్నవరం ప్రముఖమైనది. 1982లో టీడీపీ ఏర్పాటయ్యాక ఒక్క 1989 ఎన్నికల్లో మాత్రమే గన్నవరంలో టీడీపీ ఓడిపోయింది. ఆ తర్వాత ఎప్పుడూ టీడీపీ అక్కడ ఓటమి చూడలేదు. 2004లో కాంగ్రెస్ గాలి వీచినప్పుడు కూడా టీడీపీ గెలిచింది. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభంజనంలోనూ గన్నవరంలో టీడీపీనే విజయబావుటా ఎగురవేసింది.ఒక విధంగా ఇలాంటి బలమైన నియోజకవర్గం టికెట్ తనకు ఇచ్చినందుకు వల్లభనేని వంశీ చంద్రబాబుకు రరుణపడి ఉండాలి. కానీ, వంశీ ఏం చేశాడు ?, గత ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ తరఫున గెలుపొంది, కొద్ది కాలానికే వైసీపీతో అంటకాగుతూ వస్తున్నాడు. పైగా నిత్యం బాబు, లోకేష్ లను తిడుతూ వల్లభనేని వంశీ తన పైత్యాన్ని చూపిస్తున్నాడు. అందుకే, గన్నవరంలో ఎలాగైనా వల్లభనేని వంశీని ఓడించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌ను వల్లభనేని వంశీ నోటికొచ్చిన‌ట్టే తిట్టడమే అందుకు ప్రధాన కారణం. దీంతో వల్లభనేని వంశీ అంతు చూడాల‌నే ల‌క్ష్యంతో టీడీపీ వుంది. వ‌రుస‌గా రెండు సార్లు గన్నవరం నుంచి వల్లభనేని వంశీ గెలుపొందారు. వంశీ, జ‌గ‌న్ కేబినెట్‌లో పదవి దక్కించుకోకపోయినా, కొన్ని కాంట్రాక్ట్ లను దక్కించుకున్నాడు అని టాక్ ఉంది. అందుకే, జ‌గ‌న్‌కు అండ‌గా నిల‌బ‌డ‌డంలో వల్లభనేని వంశీ ఏ మాత్రం వెనుకంజ వేయ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అభ్య‌ర్థుల ఎంపిక‌పై చంద్ర‌బాబు తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గన్నవరం సీటును చంద్ర‌బాబు సీరియ‌స్‌గా తీసుకున్నారు.

వల్లభనేని వంశీ పై దీటుగా మాట్లాడగలిగే బలమైన అభ్యర్థిని నిల‌బెట్టాల‌ని చంద్ర‌బాబు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. కొన్నేళ్లుగా గన్నవరంలో టీడీపీకి అండ‌గా ఉంటున్న కొందరు నాయకులను కూడా ప‌క్క‌న పెట్టేందుకే చంద్ర‌బాబు మొగ్గు చూపుతున్న‌ట్టు తెలిసింది. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కి గన్నవరం టికెట్ ఇవ్వడానికి బాబు ఆల్ మోస్ట్ ఓకే చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి, వంశీ లాంటి బలమైన నేతతో పోరాడి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గెలుస్తారా ?, గన్నవరం నియోజకవర్గంలో కమ్మ ఓటర్ల సంఖ్య ఎక్కువ. దాదాపుగా 55 వేల మంది ఓటర్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే.

కమ్మ ఓటర్ల తర్వాత యాదవుల ఓట్లు 38 వేల వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కమ్మ ఓట్లన్నీ టీడీపీకే పడే చాన్సు ఎక్కువ. కాబట్టి, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గెలుపు దాదాపు ఖరారు. ఐతే, వంశీకి అంటూ ప్రత్యేకమైన ఆర్మీ ఉంది. వారంతా వంశీ కోసం పని చేస్తున్నారు. మరోవైపు టీడీపీకి అండగా ఉన్న బచ్చుల అర్జునుడు గుండెపోటుతో ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తేనే గన్నవరం నుంచి గెలిచే ఛాన్స్ ఉంటుంది.

CLICK HERE!! For the aha Latest Updates