HomeTelugu Trendingఆ సినిమా కోసం 40 రోజులు కేటాయించిన రామ్‌ చరణ్‌..

ఆ సినిమా కోసం 40 రోజులు కేటాయించిన రామ్‌ చరణ్‌..

1 11
మెగా స్లార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. వినోదం .. సందేశం కలగలసిన కథతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి కొత్త లుక్ తో కనిపించనున్నారు. హీరోయిన్‌గా త్రిష పేరు వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో చరణ్ కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి .. అది నిజమేననేది తాజా సమాచారం.

కథా పరంగా చిరంజీవి యువకుడిగా వున్నప్పటి పాత్రలో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమా కోసం చరణ్ 40 రోజులను కేటాయించినట్టుగా చెబుతున్నారు. తెరపై ఆ పాత్ర నిడివి ఎంతవరకూ ఉంటుందో తెలియదుగానీ, కొరటాల ఏదో పెద్ద ప్రయోగమే చేయనున్నాడని ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగులో బిజీగా వున్న చరణ్, ఆ తరువాత కొరటాల సెట్స్ పైకి వస్తాడని అంటున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu