HomeTelugu Trendingయూట్యూబ్ ట్రెండింగ్‌లో రౌడీ బేబీ టాప్‌..!

యూట్యూబ్ ట్రెండింగ్‌లో రౌడీ బేబీ టాప్‌..!

5 6
హీరో ధనుష్‌, సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ‘మారి 2’ చిత్రం తమిళంలో కమర్షియల్‌ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘రౌడీ బేబీ’ సాంగ్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే చిత్రయూనిట్‌ రౌడీబేబీ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది. అప్పటి నుంచి రికార్డులు సృష్టిస్తున్న ‘రౌడిబేబీ’ ట్రెండింగ్‌ సాంగ్స్‌ జాబితాలో అగ్రస్థానంలో నిలిచినట్లు తాజాగా యూట్యూబ్‌ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రౌడిబేబీ 725 మిలియన్ల వ్యూస్‌తో 7వ స్థానంలో నిలిచింది. హీరో ధనుష్‌ రచించి పాడిన ఈ పాటకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించగా, ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌, దర్శకుడు ప్రభుదేవా కొరియోగ్రఫి చేశారు.కాగా బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహించిన మారి-2లో టోవినో, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, కృష్ణ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu